Wither Democracy? - Current trends in India and its beyond
- NRR Research Center
- Apr 5
- 1 min read
Interactive seminar jointly with Raghavachari Trust
Moderator and speaker
Anji Reddy, Achara Nararjuna University
Speakers
Prof. Murali Karanam, Human rights and Director of Access to Justice Program, NALSAR University, Hyderabad
Prof. Padmaja Shaw, Formerly Head of Department of Communications and Journalism, Osmania University, Hyderabad
Dr. Ajay Godavarthy, Associate Professor, Center for Political Studies, School of Social Science, Jawaharlal Nehru University, Delhi
"ప్రజాస్వామ్యం- భారతదేశంలో ప్రస్తుత ధోరణులు, వాటి పరిణామాలు” అనే అంశంపై సదస్సు శనివారం సిఆర్ ఫౌండేషన్లోని నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రంలో జరిగింది. సదస్సుకు నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంజి రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, జర్నలిస్ట్ డాక్టర్ పద్మజా షా, హైదరాబాద్ లోని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మురళీ కరణం ప్రసంగించారు. ప్రొఫెసర్ అజయ్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో సామాజిక అంశాలను రూపొందించే పాలక బిజెపి వ్యూహం గురించి ప్రస్తావిస్తూ బిజెపి తన భావజాల వ్యాప్తిలో విజయం సాధించిన హర్యానాను ఉదహరిస్తూ వామపక్ష శక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్ అంజిరెడ్డి ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం నుండి, ముఖ్యం గా 1980వ దశకం నుండి ఇప్పటివరకు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణామాలను వివరిం చారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ సానుకూలంగా ప్రారంభమైందని, క్రమంగా పాలకవర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడే నయా ఉదారవాద, సాంస్కృతిక, జాతీయవాద లక్షణాన్ని సంతరించుకుందని, ఇది చివరికి తీవ్ర ఆర్థిక అసమానతలకు దారితీసిందన్నారు. ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ మీడియా వ్యాపార సంస్థలలో ఒక ప్రత్యేక వర్గం గందరగోళపరిచే కంటెంట్తో సమాజాన్ని తప్పుదారి పట్టించే కుట్ర, ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అన్ని రూపాల్లో సోషల్ మీడియా ప్రయోజనాల కంటే ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ మురళీ కర్ణం సమాజానికి ప్రజా విద్య అనే భావనను నొక్కిచెప్పారు. ఇది పాలక పార్టీ దుష్ట ప్రణాళికలు, విధానాలను విశ్లేషించడంలో సహాయపడుతుందన్నారు. తొలుత నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాబు స్వాగతోపన్యాసం చేస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను నొక్కి చెప్పారు. అసమానత, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, రాజకీయ అవినీతి వంటి సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో ప్రగతిశీల ఆలోచనాపరులు అధ్యయనం చేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశానికి సీనియర్ సంపాదకులు దివంగత సి.రాఘవాచారి ట్రస్ట్ ప్రతినిధి కె.జ్యోత్స్న వందన సమర్పణ చేశారు.
Comments