Science Day Celebrations @ NRR RC
- NRR Research Centre
- Mar 2
- 2 min read



నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం , సి ఆర్ ఫౌండేషన్ లో కోలాహలంగా సైన్స్ డే వేడుకలు –
ఇస్రో ‘స్పేస్ ఆన్ వీల్స్’ ప్రత్యేక ఆకర్షణ*
హైదరాబాద్ కొండాపూర్‌లోని Neelam Rajasekhar Reddy Research Centre ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు Indian Space Research Organisation (ఇస్రో) నుంచి ‘స్పేస్ ఆన్ వీల్స్’ ప్రత్యేక ప్రదర్శన వాహనం(బస్), అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నమూనాలు, చిత్రాలు, శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ శ్రీ ఆరేకపూడి గాంధీ హాజరు అయ్యి ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ బస్సును, విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ ని ప్రారంభించి వాటిని సందర్శించారు. గౌరవ అతిథిగా సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, శ్రీ సయ్యద్ అజీజ్ పాషా పాల్గొన్నారు.
విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనతో పాటు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ మ్యాజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భములో మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను పిల్లలకు వివరించారు. విద్యార్థులకు అవగాహన, సృజనాత్మక శక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం, సి ఆర్ ఫౌండేషన్ సంస్థలను అభినందించారు.
ఐదున్నర దశాబ్దాలుగా దేశ ఆర్ధిక, సాంకేతిక రక్షణ రంగ పురోగతికి ఇస్రో చేస్తున్న కృషిని గురించి డా. ఆర్ శ్రీనివాస్ , ఎన్ ఆర్ ఎస్ సి - ఇస్రో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వివరించారు. జనవిజ్ఞాన వేదిక క్రియాశీల సభ్యులు శ్రీ చంద్రయ్య సైన్స్ మ్యాజిక్ షో నిర్వహించి సమాజం లోని సాంఘిక దురాచారాలు మూడ నమ్మకాల వలన జరిగే నష్టం గురించి, అలాగే సైన్స్ గురుంచి వివరించారు.
ఈ ప్రదర్శన లో న్యూ బ్లూమ్ హై స్కూల్, మహా భాష్యం స్కూల్ , సెయింట్ ఇసాక్ అడ్వంట్ స్కూల్, కొత్తగూడ గవర్నమెంట్ హై స్కూల్ , శ్రీ సాహితి స్కూల్ మరియు సాహితి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనలో విండ్ మిల్ సోలార్ ఎనర్జీ , హైడ్రో ఎలక్ట్రిసిటీ , అమరావతి క్వాంటుం వ్యాలీ, రైన్ వాటర్ హార్వెస్టింగ్ , వేస్ట్ మానేజ్మెంట్ , రెన్యూవబుల్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్ , ట్రెడిషనల్ అండ్ మోడరన్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ , స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ ,మాదకద్రవ్యం, మద్యపాన దుర్వినియోగం, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ మరియు ఎన్నో సైన్స్ అంశాల మీద ప్రాజెక్టులు ప్రదర్శించారు.
నీలం రాజశేఖరరెడ్డి పరిశోధన కేంద్రం ఆద్వర్యములో ఏర్పాటు చేసిన జడ్జెస్ కమిటీ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటినీ సందర్శించి వివరాలు సేకరించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఆర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. టి. సురేష్ బాబు , కన్వీనర్ కె. అజయ్ కుమార్ , కమిటీ సభ్యులు డా. బి వి విజయలక్ష్మి , డా. డి. శ్రీనివాస రావు , జ్యోత్స్న , రాజగోపాల్ రెడ్డి , దేవేందర్ రావు, టీ. సుబ్బరామన్ , సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ పి జే చంద్రశేఖర రావు, వృద్ధాశ్రమం డైరెక్టర్, సీఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి. చెన్నకేశవ రావు , మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్
జే కల్పన మరియు సభ్యులు , సీఆర్ పోలి క్లినిక్ డైరెక్టర్ డా. రజని, సి ఓ ఓ శ్రీమతి విజయలక్ష్మి, వృద్ధాశ్రమవాసులు , విశ్రాంత శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు,
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యానికి, సిఆర్ ఫౌండేషన్ సిబ్బందికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
.jpg)



Comments