top of page

Digital media and women: Impact and consequences

Updated: Jun 5

Interactive meet on the eve of International Women's Day

Speaker Dr. Anil Rachamalla


డిజిటల్ మీడియాతో... మహిళలపై ప్రభావం - పరిణామాలు అనే అంశంపై సదస్సు నీలం రాజశేఖరరెడ్డి పరిశోధన కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి, మార్చ్ 8 (నిఘా న్యూస్): కొండాపూర్లోని సిఆర్ఫౌండేషన్ ఆవరణలో ఇంద్రజిత్ గుప్తా హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా “డిజిటల్ మీడియా -మహిళలు - ప్రభావం - పరిణామాలు” ఈ అంశంపై ఎండ్నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాలమ్ రచయిత, ఇంటర్నెట్ నీతి, డిజిటల్ వెల్ బీయింగ్ నిపుణుడు, పబ్లిక్ పాలసీ ఔత్సహికులు డా. అనిల్ రాచమల్ల విపులంగా ప్రసంగించారు. డిజిటల్ మీడియా వల్ల మహిళలు, సమాజం మొత్తం ఏ విధంగా నష్ట పోతున్నారు అనే అంశంపై విపులంగా వివరించారు. నిత్య జీవితంలో అపరిచితులతో ఎలా ఉంటామో అలాగే అంతర్జాల వినియోగ సమయంలోను ఉంటే భద్రత మెరుగుగా ఉంటుందని చెప్పారు. వివిధ రకాల డిజిటల్ మోసాల గురించి విపులంగా వివరిస్తూ, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పారు.


సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఉపయోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా సమాజంలో, ఈ డిజిటల్ యుగంలో మహిళల భద్రత సమస్యగా మారిందని, దీనిని మనం దైనందిన కార్యక్రమాల్లో వినియోగించే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే మన సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాలు ఎంత తక్కువగా షేర్ చేస్తే అంత మంచిదని చెప్పారు. వివిధ రకాల భద్రతా పోర్టల్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఏ.ఐ.టి.యు.సి ఆండ్ ఎన్.ఎఫ్.ఐ. డబ్లు మాజీ కార్యదర్శి డా. బివి విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. డా. అనిల్ రాచమల్లని ఎన్ఆర్ఆర్ రిసెర్చ్ సెంటర్ కమిటి సభ్యులు సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డా.జ.ప్రభాకర్ రావు సభకు పరిచయం చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎన్ ఆర్ ఆర్ రిసెర్చ్ సెంటర్, మహిళా సంక్షేమ కేంద్రం సంయుక్తంగా సరోజినీదేవి ఆసుపత్రి రిటైర్డ్ సర్జన్ డా. సరస్వతిని, సిఆర్ ఫౌండేషన్ ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డా.రజనిని ఘనంగా సన్మానించారు. కనిపర్తి జ్యోత్స్న వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.ఫౌండేషన్ నిర్వాహకులు, వృద్ధాశ్రమవాసులు,


ఎస్ఆర్ఆర్ రీసెర్చ్ సెంటర్ సభ్యులు, మహిళా సంక్షేమ కేంద్రం విద్యార్థినిలు, ఉపాధ్యాయులు అలాగే భాష్యం, ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.









Press Coverage










Comments


© 2025 CR Foundation

bottom of page